Site icon Prime9

Major Movie : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ని కలిసిన హీరో అడివి శేష్..

ex president ramnath kovind appreciates major movie team

ex president ramnath kovind appreciates major movie team

Major Movie : ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు “అడివి శేష్”. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. ఆ మూవీ లో అడవి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని మహేష్ బాబు నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. గత సంవత్సరం మే 22న ఈ సినిమా రిలీజైంది.

మేజర్ సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించిన అనంతరం ఓటీటీలలో, టీవీలలో కూడా మంచి రీచ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, యోగి ఆదిత్యనాథ్, ఉద్దవ్ థాక్రే, రాజ్ నాథ్ సింగ్.. ఇలా అనేకమంది మేజర్ సినిమాని అభినందించి అడివి శేష్, యూనిట్ ని కూడా ప్రశంసించారు. తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అడివి శేష్ ని అభినందించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల మేజర్ సినిమా చూసి నచ్చడంతో అడివి శేష్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అడివి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి చర్చించారు. దీంతో అడివి శేష్ రామ్‌నాథ్ కోవింద్ ని కలవడంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఆ మాటలు మర్చిపోలేను (Major Movie) – అడివి శేష్

రామ్‌నాథ్ కోవింద్ ని కలిసిన వీడియోని అడివి శేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మేజర్ సినిమా రిలీజయి సంవత్సరం కావొస్తుంది. ఇంకా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారిని కలిశాను. ఆయన మేజర్ సినిమా చూసి దాని గురించి మాట్లాడటం నేను మర్చిపోలేను. నా లైఫ్ లో ఇదొక మర్చిపోలేని మూమెంట్ అంటూ ఎమోషనల్ గా పోస్టు చేశారు. దీంతో మరోసారి అడివి శేష్ ని అంతా అభినందిస్తున్నారు. ఇక అడివి శేష్ ప్రస్తుతం గూడాచారి 2 సినిమా షూట్ లో ఉన్నాడు.

Exit mobile version
Skip to toolbar