Gujarat: గుజరాత్ లో వంతెన కూలి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన మోర్బి ఘటనా సమయంలో ఓ వ్యక్తి సాహోసపేతంగా వ్యవహరించారు. నదిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న ప్రజల్ని ప్రాణాలు కాపాడి మరణాల సంఖ్య తగ్గించాడు. అందరి ప్రసంశలు అందుకొన్నారు. ఆ ఘోర సంఘటన సమయంలో ప్రాణాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా, ఆ వ్యక్తిని భాజపాకి చెందిన మాజీ శాసనసభ్యులు కాంతిలాల్ శివలాల్ అమృతీయగా గుర్తించారు.
గత నెల 30న మోర్బీ ప్రాంతలో బ్రిడ్జ్ కూలిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ కూడ ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. పర్యాటకులు, స్థానికులు నదిలో పడిపోవడాన్ని గుర్తించి, తను కూడా నదిలోకి దూకాడు. ఈత కొడుతూ, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నాన్ని చేసి విజయం సాధించాడు. దాదాపుగా 70మంది ప్రాణాలు కాపాడిన్నట్లు స్థానికుల సమాచారంతో తెలియవస్తుంది. గజ ఈతగాళ్లు, రెస్య్కూ టీంలతో పాటు కాంతిలాల్ ఓ పౌరుడుగా బాధ్యతలు నిర్వర్తించి పలువురి ప్రాణాలను సురక్షింతంగా కాపాడాడు.
పటేల్ సంఘానికి చెందిన కాంతిలాల్ శివలాల్ యువకుడిగా ఉన్న సమయంలో మోర్బి డ్యాం వద్ద విపత్తుల సమయంలో బాధితుల పునరావాసంలో పనిచేశాడు. స్థానికుడుగా ఉన్న అతను ఏబీవీపి విద్యార్ధి నేత ఎదిగాడు. అనంతరం భాజపాలో కార్యకర్తగా చేరాడు. ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందులో కాంతిలాల్ ఎప్పుడూ ముందుండేవాడు. రాజకీయ నేతగా ఎదిగిన అతడు మోర్బీ పురపాలక సంఘంలో సభ్యుడుగా ప్రారంభించి పార్టీ క్యాడర్ కు బాధ్యతలు చేపట్టే స్ధాయికి ఎదిగాడు. 5పర్యాయాలు శాసనసభ్యులుగా సేవలందించారు. స్థానిక ప్రజలకు కాంతిలాల్ శివలాల్, కనాభాయ్ గా సుపరిచస్ధుడు. వ్యవసాయంతో పాటు పలు స్ధానిక పరిశ్రమల్లో జీవననం సాగించడంతో అతను ప్రజలకు చాలా దగ్గరైనాడు.
ఇది కూడా చదవండి: Culvert collapsed: కుప్పకూలిన కల్వర్టు.. క్షేమంగా బయటపడ్డ జనం.. యుపిలో ఘటన