Site icon Prime9

Congress President Polls: నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక

Congress-President-Polls

Congress-President-Polls

New Delhi: 22 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎఐసిసి అధ్యక్షుడిని నిర్ణయించేందుకు ఆ పార్టీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ పదవికి పోటీ చేస్తును మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ పలు రాష్ట్రాల్లో పర్యటించి, నేతలను కలుసుకొని మద్దతు కోరారు. ప్రచార ప్రక్రియ ఆదివారం నాటికే ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల 300 మంది పైగా కాంగ్రెస్‌ నిర్వాహకులు ఓటర్లుగా ఉన్నారు. 36 పోలింగ్‌ స్టేషన్లలో 67 బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక బూత్‌ ఉంటుంది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి కార్యాలయాల్లో పోలింగ్‌ జరుగుతుంది. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పేపర్లు, పోలింగ్‌ బాక్స్‌లు ఇప్పటికే సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల పిసిసిలకు పంపింది. పోలింగ్‌ కోసం పిసిసి కార్యాలయాలలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ సర్వసభ్య మండలి సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, సిడబ్ల్యుసి సభ్యులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. బళ్లారిలోని సంగనకల్లులోని భారత్‌ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో రాహుల్‌ గాంధీతో పాటు 47 మంది పిసిసి డెలిగేట్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. బెంగళూర్‌లోని పిసిసి కార్యాలయంలో మల్లికార్జున్‌ ఖర్గే, తిరువనంతపురంలోని పిసిపి కార్యాలయంలో శశిథరూర్‌ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

బ్యాలెట్‌ పేపర్‌లో మొదటి పేరుగా మల్లికార్జున ఖర్గే పేరు ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించారు. ఆ తరువాత రెండవదిగా శశిథరూర్‌ పేరును ముద్రించారు. ఎన్నికల పూర్తయిన తరువాత బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసి ఢిల్లీకి పంపిస్తారు. ఈనె 19న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులను ఎంపిక చేశామని ఢిల్లీ పిసిసి రిటర్నింగ్‌ అధికారి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బిజెపిలో ఎన్నికల ప్రక్రియ లేకుండానే అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారనివి మర్శించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఎనిుకలు నిర్వహిస్తున్నామని అన్నారు.

Exit mobile version