Site icon Prime9

CM Stalin: హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు.. తమిళనాడు సీఎం స్టాలిన్.

cm stalin

cm stalin

Tamil Nadu: దేశంలో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు . తమిళనాడు సీఎం స్టాలిన్. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని ఆయన స్పష్టం చేశారు. హిందీ మాట్లాడే వాళ్లే భారత పౌరులు, మిగతా వారంతా ద్వితీయ శ్రేణి పౌరులూ అంటూ భేదభావంతో చూడటం సరికాదన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దేశంలో మరో భాషా యుద్ధానికి తెరతీయవద్దని వ్యాఖ్యానించారు. దేశంలో హిందీ భాష వినియోగం పెంచడం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల సమర్పించిన నివేదిక పై స్టాలిన్ మండిపడ్డారు.

హిందీ మాట్లాడే వాళ్లే దేశ పౌరులా..
హిందీ మాట్లాడే వాళ్లే భారత పౌరులు, మిగతా వారంతా ద్వితీయ శ్రేణి పౌరులూ అంటూ భేదభావంతో చూడటం దేశాన్ని విభజించి పాలించడమే. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనను ఇంగ్లీషు నుంచి హిందీ లేదా స్థానిక భాష మాధ్యమానికి మార్చాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. హిందీని అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరాలని సూచించింది. ఇది హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే అని స్టాలిన్ ఆరోపించారు.తమపై మరో భాషా యుద్ధాన్ని రుద్దవద్దని స్టాలిన్ డిమాండ్ చేశారు.

Exit mobile version