ED charge sheet:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడవ చార్జిషీటులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఈసారి ఈడీ మరికొన్ని కీలక అంశాలని బయటపెట్టింది. 2023 మార్చి 28న కవిత పిఎ బుచ్చిబాబు ఇచ్చిన వివరాలని చార్జిషీట్‌లో ఈడీ పొందు పరిచింది. కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా చార్జిషీటులో ఉండటం గమనార్హం.
మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్‌లపై కొత్త అభియోగాలు మోపారు.లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్‌ది కీలక పాత్రని ఈడీ మరోసారి చెప్పింది సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఇచ్చిందని ఈడీ ఆరోపించింది.. లిక్కర్ వ్యవహారంలో కవిత బినామీ అరుణ్ పిళ్ళై అని ఈడీ తేల్చింది.
హైదరాబాద్ లో భూములు కొన్న కవిత..(ED charge sheet)
లిక్కర్ వ్యాపారంలో లాభాలతో కవిత హైదరాబాద్‌లో భూములు కొన్నారని ఈడీ వెల్లడించింది. కవిత హైదరాబాద్‌లో 3 ఆస్తులు కొనుగోలు చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.ఫీనిక్స్ ద్వారా భూములు కొనుగోలు చేశారని ఈడీ తెలిపింది. కవితతోపాటు భర్త అనిల్‌కుమార్ పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చింది.ఎన్ గ్రోత్ క్యాపిటల్‌లో పెట్టుబడులు పెట్టిన కవిత భర్త అనిల్ ఈ సంస్థ ద్వారానే ఫీనిక్స్ భూములని కొన్నారని ఈడీ తేల్చింది. ఫీనిక్స్ సీఓఓ శ్రీహరి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని ఈడీ వివరించింది.
https://youtu.be/weu_84H5Xb4