Site icon Prime9

CM Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో రెండు బీఎండబ్ల్యూ కార్లు, రూ36 లక్షలనగదు స్వాధీనం చేసుకున్న ఈడీ

Hemant Soren

Hemant Soren

CM Hemant Soren: ఢిల్లీలోని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోరెన్ ఇంట్లో లేనందున ఈడీ బృందం అతన్ని ప్రశ్నించలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అజ్జాతంలో సీఎం సోరెన్ ..(CM Hemant Soren)

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ నివాసానికి సోమవారం ఉదయం ఈడీ అధికారులు చేరుకున్నారు.సుమారుగా 13 గంటల పాటు వారు సోదాలు చేశారు.హేమంత్ సోరెన్ కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ఈడీ బృందాలు నిఘా ఉంచినట్లు సమాచారం.జనవరి 27 న, హేమంత్ సోరెన్ రాంచీ నుండి ఢిల్లీకి బయలుదేరారు.అయితే, ఈడీ విచారణకు భయపడి 18 గంటల పాటు ఆయన కనిపించకుండా పోయారని ఆరోపిస్తూ బీజేపీ జార్ఖండ్ యూనిట్ ఎదురుదాడి చేసింది. ఈ మేరకు బీజేపీ నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు విజ్ఞప్తి చేశారు. మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం జనవరి 29 లేదా 31 తేదీల్లో తమ ఎదుట హాజరుకావాలంటూ గత వారం ఈడీ సోరెన్‌కు తాజా సమన్లు జారీ చేసింది.దీనికి స్పందనగా సోరెన్ జనవరి 31న మధ్యాహ్నం 1 గంటకు తన నివాసంలో విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. మనీలాండరింగ్ కేసు లో తనపై విచారణ రాజకీయప్రేరితమని కూడా ఆయన పేర్కొన్నారు.

మిస్సింగ్ పోస్టర్ ..

జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ మంగళవారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి 11,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామంటూ పేర్కొన్నారు. అంతేకాదు ‘మిస్సింగ్’ పోస్టర్‌ను కూడా ట్వీట్ చేశారు.పోస్టర్‌లో, సోరెన్‌ను 5 అడుగుల 2 అంగుళాలు, తెల్ల చొక్కా మరియు నల్ల ప్యాంటు మరియు చెప్పులు ధరించి ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు.సోరెన్ 40 గంటలకు పైగా కనిపించకుండా పోయారని, చివరిసారిగా తెల్లవారుజామున 2 గంటలకు తన భద్రతా సిబ్బందితో కలిసి సంచరించారని పోస్టర్ పేర్కొంది. సోరెన్ ఆచూకీ తెలిపితే రాంచీలోని ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి సమాచారం ఇవ్వాలని, రూ.11,000 నగదు బహుమతి ఇస్తామని ప్రజలకు తెలిపారు.

Exit mobile version