Site icon Prime9

Former MLA Mukhtar Ansari: మాఫియా నేత ముఖ్తార్ అన్సారీ నివాసాలపై ఈడీ దాడులు

New Delhi: మాఫియా నేత ముఖ్తార్ అన్సారీ మరియు అతని సన్నిహితుల ఇళ్ల పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో100 బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ గురువారం దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అన్సారీ మరియు అతని సహచరులతో సంబంధం ఉన్న ఘాజీపూర్, లక్నో మరియు ఢిల్లీలోని స్థలాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద అన్సారీ పై కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడం కోసం ఈ సోదాలు జరుగుతున్నాయి. ఘాజీపూర్ జిల్లా యంత్రాంగం గత వారం అన్సారీ అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన రూ. 6 కోట్ల విలువైన రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకుంది.

Exit mobile version