Site icon Prime9

BRS MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్.. డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగుస్తుందా?

ed notice to mlc kavitha about delhi liquor scam

ed notice to mlc kavitha about delhi liquor scam

BRS MLC Kavitha : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం అందుతుంది. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు పిళ్లై  వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన ధర్నాకు దిగనున్నట్టుగా ఇటీవల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ నిరసనలో ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ మహిళా సంఘాలు, నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు.

అదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అరెస్టు చేసే అవకాశంపై అడిగిన ప్రశ్నకు కవిత స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. బీజేపీ నాయకులు చెబితే తనను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని అన్నారు. అరెస్ట్ గురించి దర్యాప్తు సంస్థ చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదని అన్నారు. అయితే ఢిల్లీ కవిత ధర్నాకు ఒక్క రోజు ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈడీ నోటీసులకు, ఢిల్లీలో కవిత ధర్నాకు నేరుగా సంబంధం లేకున్నా.. ధర్నాపై మాత్రం ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై కవిత ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. ఒకవేళ కవిత రేపు ఈడీ విచారణకు హాజరైతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే చర్చ సాగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రని ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే విచారణ కీలకం కానుంది.

కవితకు రామచంద్రపిళ్లై బినామీ అని, ఆమెకు లబ్ధి చేకూర్చేందుకు ఆయన అన్నీ తానై వ్యవహరించారని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌కు చెందిన ఇండోస్పిరిట్స్ సంస్థలో కవిత తరపున పిళ్లై భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేశారు. పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో గతేడాది డిసెంబరు 11న కవితను ఆమె ఇంటి వద్దే సీబీఐ అధికారులు విచారించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version