Tamil Nadu Minister: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. అధికారులు తన ప్రాంగణంలో ఏమి వెతుకుతున్నారో తనకు తెలియదని, విచారణకు పూర్తి సహకారం అందిస్తానని మంత్రి బాలాజీ హామీ ఇచ్చారు.
మనీలాండరింగ్ చట్టం కింద ..(Tamil Nadu Minister)
చెన్నైలోని బాలాజీ నివాసం, ఆయన స్వస్థలమైన కరూర్‌లో సోదాలు జరుగుతున్నాయి.బాలాజీ 2014లో అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోర్ట్‌ఫోలియోను కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంపై పోలీసు మరియు ఈడీ విచారణకు సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ కూడా రాష్ట్రంలోని బాలాజీకి సన్నిహిత వ్యక్తులపై సోదాలు చేసింది.
ఇలా ఉండగా ఈడీ సోదాలపై బాలాజీ స్పందిస్తూ దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏం వెతుకుతున్నారో చూద్దాం. అది ముగియనివ్వండి అని సోదాలు ప్రారంభించిన వెంటనే విలేకరులతో అన్నారు.అది ఐటీ లేదా ఈడీ అయినా, సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని బాలాజీ హామీ ఇచ్చారు, పత్రాల ఆధారంగా అధికారులు ఎలాంటి వివరణ కోరితే అది అందజేస్తామని హామీ ఇచ్చారు.