Site icon Prime9

PM Modi’s birthday: మోదీ బర్త్ డే.. 40 నిమిషాల్లో తాలీని తింటే రూ.8.5ల‌క్ష‌ల బ‌హుమ‌తి

pm-modi-thali

Delhi: సెప్టెంబ‌ర్ 17న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పుట్టిన‌రోజు. ఈసంద‌ర్భంగా బంప‌ర్ ఆఫ‌ర్ ని ప్ర‌క‌టించింది ఓ రెస్టారెంట్. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో రూపొందించిన ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో లాగించిన వారికి రూ.8.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది. ఈ రెస్టారెంట్ పేరు ఆర్డర్ 2.0

దీని యజమాని సుమిత్రా కల్రా మీడియాతో మాట్లాడుతూ మోదీని తాము ఎంతో గౌరవిస్తామని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నామని, అందుకే తాలీ పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకమైన తాలీకి ’56 అంగుళాల మోడీజీ’ అని పేరు పెట్టినట్టు వివరించారు. ఈ పోటీలో దంపతులు పాల్గొనవచ్చని, వారిలో ఏ ఒక్కరైనా 40 నిమిషాల్లోపు తాలీ మొత్తం తింటే వారికి రూ.8.5 లక్షల రివార్డు అందజేస్తామని వెల్లడించారు. అంతేకాదు, సెప్టెంబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య తమ రెస్టారెంట్ లో తాలీ భుజించిన వారిలో లక్కీ విన్నర్ కు కేదార్ నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామని సుమిత్ర కల్రా వెల్ల‌డించారు. మ‌రి ఈ పోటీల్లో పాల్గొని గెలిచేవారు ఎవ‌రో చూడాలి.

మోదీ జన్మదినాన్ని 16 రోజుల పాటు సేవా పఖ్వారా (సేవా పక్షం రోజులు)గా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా పార్టీ కార్యకర్తల కార్యక్రమాల షెడ్యూల్‌కు లేఖ రాశారు. సెప్టెంబర్ 17, 2022 నుండి పార్టీ ‘సేవా పఖ్వారా’ను జరుపుకోనుండగా, ఇది జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2, 2022 వరకు కొనసాగుతుంది. “మోదీ @20 సప్నే హ్యూ సకార్” అనే పుస్తకాన్ని కూడా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది.

Exit mobile version