Earthquake Tremors: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఆదివారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలు భయంతో పరుగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భూకంప కేంద్రం హర్యానాలోని ఫరీదాబాద్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరియు ఉపరితలానికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. కొద్దిరోజుల కిందట పశ్చిమ నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీనితో ఢిల్లీ, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశంలో సంభవించిన వరుస భూకంపాలలో ఇది అత్యంత బలమైనది. ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా, ప్రాంతీయ రాజధాని హెరాత్‌కు వెలుపల 34 కిలోమీటర్ల దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల ఆఫ్గనిస్తాన్ లో సంభవించిన భూకంపంతో వేలాది మంది చనిపోవడంతో పాటు వందలాది ఇళ్లు ధ్వంసమయిన విషయం తెలిసిందే.