Site icon Prime9

Chennai: అతివేగం..ఇద్దరు యువ సాఫ్ట్ వేర్లు బలి

Due to over speed, two engineers were killed

Due to over speed, two engineers were killed

Chennai: ఓ కారు అతి వేగానికి ఇద్దరు యువ సాఫ్ట్ వేర్లు మృతి చెందారు. ప్రధాన నగరాల్లో జాతీయ రహదారుల్లో ప్రభుత్వ ఉదాశీనతతో చోటుచేసుకొన్న ఈ ఘటన తమిళనాడు చెన్నైలో చోటుచేసుకొనింది పోలీసుల సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులు ఓల్డ్ మహా బలిపురం రోడ్డు దాటుతుండగా ఓ కారు వారివురిని ఢీకొట్టింది. ఐటి కారిడార్ లో విధులు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన యువతులపైకి ఆ కారు అతి వేగంగా దూసుకెళ్లింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొక యువతి హాస్పిటల్ లో మరణించిన్నట్లు సమాచారం. మృతిచెందిన వారిని తిరుపతికి చెందిన లావణ్య, కేరళలోని పాలక్కడ్ కు చెందిన శ్రీలక్ష్మీలుగా పోలీసులు గుర్తించారు.

కారు డ్రైవర్ అతి వేగంగా 130కి.మీ స్పీడుతో వాహనాన్ని నడుపుతూ, నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగిన్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై ఐటి క్యారిడార్ చాలా కంపెనీలు ఉన్నాయ్. టోల్ రహదారిపై తగిన జీబ్రా క్రాసింగ్ లు లేకపోవడంతో పాదాచారులు ట్రాఫిక్ ను దాటుకుంటూ రోడ్డును దాటుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువతుల మృతికి కారణమైందని స్థానికులు ఆవేదనతో తెలియ చేశారు. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు ప్రాధమిక విచారణలో కారు డ్రైవర్ ది తప్పిదంగా తేల్చారు.

Exit mobile version