set top boxes: టీవీ సెట్ టాప్ బాక్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం టీవీ చూడాలంటే టీవీతో పాటు విడిగా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ప్రైవేట్ సంస్థల సెట్ టాప్ బాక్సులను తీసుకోవాలి. దానికి ప్రతీనెలా రీచార్జ్ చేయించనిదే ప్రసారాలు రావు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త చర్యల వల్ల ఈ సెట్ టాప్ బాక్సుల శకం ముగియనున్నట్టు తెలుస్తోంది.
సెట్ టాప్ బాక్సులు లేకుండానే ఉచితంగా 200కి పైగా ఛానెళ్లు..(set top boxes)
కేంద్ర బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌కి లేఖ రాశారు.ఇక నుంచి తయారయ్యే టీవీల లోపలే ఓ శాటిలైట్ ట్యూనర్ అమర్చేలా కంపెనీలకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు.దీని వల్ల సెట్ టాప్ బాక్సులు లేకుండానే టీవీలో ఉచితంగా 200కి పైగా ఛానెళ్లు, రేడియో ప్రసారాలను చూడవచ్చు లేదా వినవచ్చు. టీవీతో పాటు వచ్చే చిన్న యాంటెన్నాను ఇంటి పైకప్పు లేదా కిటికీలకు అమర్చుకుంటే సరిపోతుంది.
ఇప్పటివరకు ఫ్రీగా ప్రసారమయ్యే ఛానెళ్లకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఇప్పటివరకు .. పెయిడ్ ఛానెళ్లతో పాటే ఫ్రీ ఛానెళ్లు కూడా సెట్ టాప్ బాక్సుల ద్వారా ప్రసారమయ్యేవి. ఇప్పుడు ఆ విధానానికి చెక్ పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 55 ఛానెళ్లు విద్యా, ఉద్యోగ సమాచారం అందిస్తున్నాయి. ఇక నుంచి అవి కూడా కొత్తగా వచ్చే విధానంలో ఫ్రీగా చూసుకునే వీలుంది.కరోనా సమయంలో పేద, మారుమూల ప్రాంతాల ప్రజలు స్టడీ క్లాసుల పరంగా పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాజా ప్రతిపాదన చేశారు.
పెరిగిన దూరదర్శన్ వినియోగదారుల సంఖ్య.. (set top boxes)
దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను దశలవారీగా నిలిపివేసే ప్రక్రియలో ఉంది.డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్‌మిషన్‌ని ఉపయోగించి ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్‌లు ప్రసారం చేయడం కొనసాగుతుంది.2015 నుండి దూరదర్శన్ ఉచిత డిష్ కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అయింది.2015లో దూరదర్శన్ ఫ్రీ డిష్ వినియోగదారుల సంఖ్య 20 మిలియన్లుగా ఉండగా .2021లో ఈ సంఖ్య 43 మిలియన్లకు పెరిగింది.
ఇవి కూడా చదవండి: