Mukesh Ambani Gift: భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు. అది కూడా ముంబైలోని ప్రీమియం ప్రాంతమైన నేపియన్ సీ రోడ్‌లో ఈ భపవం ఉండటం విశేషం. కొన్ని నెలల క్రితం ఈ అంబానీ ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చారు.
రిలయన్స్ జియో మరియు రిటైల్ డైరెక్టర్ మోడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)లో దీర్ఘకాల ఉద్యోగి.నేపియన్ సీ రోడ్‌లోని నివాస ప్రాపర్టీలు సాధారణంగా చదరపు అడుగుకు రూ. 45,100 నుండి రూ. 70,600 వరకు ఉంటాయి. మోదీ కొత్త ఎత్తైన భవనం విలువ రూ.1500 కోట్లు. దీని ప్రతి అంతస్తు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది . బృందావన్ పేరుతో ఉన్న ఈ భవనం యొక్క మొత్తం వైశాల్యం 1.7 లక్షల చదరపు అడుగులు.JSW గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ కూడా నేపియన్ సీ రోడ్‌లోని ఇంట్లో నివసిస్తున్నారు.భవనంలోని మొదటి ఏడు అంతస్తులు కార్ పార్కింగ్ కోసం కేటాయించబడ్డాయి. ఇంటి ఫర్నీచర్‌లో కొన్ని ఇటలీ నుండి సేకరించినవి . దీనిని బట్టి లగ్జరీని అంచనా వేయవచ్చు.
మనోజ్ మోదీ ముంబైలో రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించారు. ఫ్లాట్ల ధర రూ.41.5 కోట్లు అని రిజిస్ట్రేషన్ పత్రంలో చూపించారు. రెండూ మహాలక్ష్మిలోని రహేజా వివారియాలో ఉన్నాయి, ఒకటి 28వ అంతస్తులో మరొకటి 29వ అంతస్తులో ఉన్నాయి.