Divya Spandana : ప్రముఖ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం నాటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆత్మహత్య ఆలోచనలు చేసినట్టు ఆఏ వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి మరణం తర్వాత తీవ్ర ఒత్తిడి లోనైనట్లు చెప్పిన ఆమె.. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఎంతో సపోర్ట్ ఇచ్చారని వివరించింది.
ఇటీవల ఓ కన్నడ టాక్ షోలో ఆమె తన తండ్రి మరణం గురించి దివ్య స్పందన ఓపెన్ అయ్యారు. ‘నాన్నను కోల్పోయిన రెండు వారాల తర్వాత నేను పార్లమెంటుకు వెళ్లాను. నాకు అప్పుడు పార్లమెంటులో ఎవరూ తెలియదు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ గురించి కూడా తెలియదు’ అని ఆమె పేర్కొంది. మెల్లమెల్లగా తాను ఆ విషయాలన్నింటినీ నేర్చుకున్నట్టు వివరించింది. తన బాధను పనిలోకి మళ్లించిందని పేర్కొంది. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గ ప్రజలు తనలో ఆత్మస్థైర్యాన్ని నింపారని తెలిపింది.
తన ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నప్పుడు రాహుల్ గాంధీ తనకు మద్దతుగా నిలబడ్డారని పేర్కొంది. ‘నాపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నాన్న ప్రభావం ఎక్కువ. వీరిద్దరి తర్వాత రాహుల్ గాంధీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది’ అని ఆమె తెలిపింది. అలానే తండ్రి మరణం తర్వాత తనలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని ఆమె చెప్పింది. ఆ తర్వాత తాను ఎన్నికల్లోనూ ఓడిపోయినట్టు వివరించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనకు సహకరించినట్టు పేర్కొంది. తనకు ఎమోషనల్‌గా మద్దతు కూడా ఇచ్చారన్నది.
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన అభి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రమ్య అలియాస్ దివ్య స్పందన. ఆ తర్వాత వరుసగా కన్నడ, తమిళ్ లో సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన అభిమన్యు లో హీరోయిన్ గా నటించింది. ఇక 2012 లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రమ్య.. 2013లో జరిగిన ఉపఎన్నికలో మాండ్యా నుంచి ఆమె లోక్ సభకు ఎన్నికైంది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గానూ పని చేసిన ఆమె.. ఆ తర్వాత పోస్టు వదిలిపెట్టింది. గత ఏడాదిలోనే ఆమె తిరిగి సినిమాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించింది. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. కాగా ఇప్పుడు దివ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.