Delhi: ఢిల్లీలో మరోసారి కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్ర ప్రమాదస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గణాంకాల ప్రకారం వాయునాణ్యత సూచీ 346గా నమోదయింది. లోధీ రోడ్, జహంగీర్‌పురి, ఆర్కేపురం, ఐజీఐ ఎయిర్ పోర్టు టీ3 వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వరుసగా 438, 491, 486, 463గా వాయు నాణ్యత నమోదైంది.
మంచు, కాలుష్యం ..( Delhi)
దిల్లీ విషయానికి వస్తే ఒక వైపు మంచు, మరో వైపు పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిని తగటబెడుతండటం వల్ల వెలువడే పొగ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో మానవులే కాకుండా జంతువులు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనితో పాటు వృక్షాలు, మొక్కలపై ప్రభావం చూపుతుంటాయి.ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 62, సెక్టార్ 1, సెక్టార్ 116 వద్ద గాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా మంది దగ్గు, జలుబు, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మండటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు అని నిఖిల్ మోదీ అనే వైద్యుడు వెల్లడించారు.
ఐదు రోజులపాటు నిర్మాణపనులు బంద్ ..
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో ఐదు రోజుల పాటు నిర్మాణ పనులు చేపట్టకూడదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్ సిగ్నల్ పడగానే వాహన ఇంజిన్ ఆపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతోపాటు 1,000 సీఎన్‌జీ ప్రవేటు బస్సులను ప్రవేశపెట్టేందుకు యత్నాలు చేస్తున్నారు.డాక్టర్లు . వీలైనంత వరకు బయటికి పోకుండా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటి ఉండేలా చూసుకోవాలని ఎన్95 మాస్క్‌లను ధరించాలని సూచిస్తున్నారు.