Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో రూ.350 దోపిడీకి పాల్పడిన ఘటనలో ఒక యువకుడిని మైనర్ దారుణంగా హత్య చేసాడు. మంగళవారం రాత్రి 11.15 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.నిందితుడు, తాగి , కత్తితో పొడిచి, తర్వాత బాధితుడి మృతదేహం పక్కన నృత్యం చేశాడు.
కేవలం డబ్బు కోసమే..(Delhi)
యువకుడిని దోచుకునే ప్రయత్నంలో మైనర్ అతనిపై ఒక్కసారిగా దాడి చేసాడు. అతను స్పృహ తప్పి కోల్పోయిన తరువాత 60 సార్లు పైగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నింతదితుడు మృతదేహం పక్కన డ్యాన్స్ చేయడం కూడా సీసీ పుటేజీలో కనపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్దలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసారు. కేవలం డబ్బు కోసమే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడికి గత ఏడాది జరిగిన హత్యలో కూడ ప్రమేయం ఉందని సమాచారం. ఈ హత్య కూడ వెల్‌కమ్ ఏరియాలోనే జరిగింది.ముగ్గురు నుంచి నలుగురు మైనర్లతో కూడిన ముఠా కలిసి ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు సమాచారం.