Delhi Liquor Scam Case:ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదరయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం తిరస్కరించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రెండూ దాఖలు చేసిన కేసుల్లో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రోస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
కవితదే కీలకపాత్ర..(Delhi Liquor Scam Case)
ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ ప్రకారం తన సంస్థకు కేటాయించిన ఐదు రిటైల్ జోన్‌ల కోసం ఆప్‌కి రూ.25 కోట్లు చెల్లించాలని అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ గతంలో ఢిల్లీ కోర్టుకు నివేదించింది.ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పిన మొత్తాన్ని చెల్లించకపోతే తెలంగాణ, ఢిల్లీలో తన వ్యాపారం దెబ్బతింటుందని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ తెలిపింది. తనకు ఢిల్లీ ప్రభుత్వంలో పరిచయాలు ఉన్నాయని, ఇప్పుడు రద్దు చేయబడిన ఎక్సైజ్ పాలసీ ప్రకారం దేశ రాజధానిలో మద్యం వ్యాపారంలో అతనికి సహాయం చేస్తానని కవిత రెడ్డికి హామీ ఇచ్చారని ఆరోపించింది.హోల్‌సేల్ వ్యాపారం కోసం రూ. 25 కోట్లు మరియు ప్రతి రిటైల్ జోన్‌కు రూ. 5 కోట్ల ముందస్తు డబ్బును మద్యం వ్యాపారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించాలని, అదే తనకు చెల్లించాలని కవిత శరత్ చంద్రారెడ్డికి కవిత చెప్పినట్లు సీబీఐ కోర్టుకు నివేదించింది. మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న కేసులో అప్రూవర్‌గా మారారు.