Delhi News: ఢిల్లీలోని జామా మసీదు మసీదు ప్రాంగణంలోకి పురుషులు లేకుండా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మసీదులోకి ఒంటరిగా లేదా గుంపులుగా మహిళలు ప్రవేశించడాన్ని నిషేధిస్తూ జామా మసీదు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
మసీదులోకి బాలికల ప్రవేశం ఖచ్చితంగా నిషేధించబడుతుందని సందర్శకులకు తెలియజేయడానికి మసీదు వెలుపల సైన్ బోర్డులను కూడా పెట్టారు. మసీదు ప్రవేశ ద్వారం వెలుపల ఉంచిన బోర్డులు ఇలా రాసి ఉన్నాయి, “అమ్మాయిలు లేదా మహిళలు ఒంటరిగా జామా మసీదులోకి ప్రవేశించడం నిషేధించబడింది. దీనిని , ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఖండించారు. . జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిలిపివేయాలనే నిర్ణయం పూర్తిగా తప్పు. పురుషుడికి పూజించే హక్కు ఎంత ఉందో, స్త్రీకి కూడా అంతే హక్కు ఉంది. నేను జామా మసీదు ఇమామ్‌కి నోటీసు జారీ చేస్తున్నాను. ఇలా మహిళల ప్రవేశాన్ని నిషేధించే హక్కు ఎవరికీ లేదు అంటూ ఆమె ట్వీట్ చేసారు.
బాలికలు లేదా మహిళలు తమ కుటుంబాలతో వచ్చి మసీదును సందర్శించవచ్చని జామా మసీదు పీఆర్వో సబివుల్లా ఖాన్ తెలిపారు.అమ్మాయిలు లేదా మహిళలు కుటుంబాలతో వచ్చే వారిపై ఎటువంటి ఆంక్షలు లేవు, వివాహిత జంటలపై కూడా ఎటువంటి ఆంక్షలు లేవని అన్నారు.