Site icon Prime9

Delhi High Court: ఆప్ సర్కార్ పై డిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Delhi High court

Delhi High court

Delhi High Court: డిల్లీ హైకోర్టు ఆప్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిల్లీ మున్సిపల్‌ స్కూళ్లలో చదువుతున్న రెండు లక్షల మంది విద్యార్థులను గాలికి వదిలేశారని మండిపడింది. జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు లక్షల మంది విద్యార్థులకు టెక్స్ట్‌ బుక్స్‌, స్టేషనరీతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేయడంలో దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోర్టు ఆప్‌ ప్రభుత్వంపై మండిపడింది. మీ వ్యవహారం చూస్తుంటే దురహంకారం… అధికార మదమెక్కినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.ప్రభుత్వంపై ఆగ్రహంతో పాటు ఎంసీడీ కమిషనర్‌ను కూడా కోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వాన్ని నిధులు ఎందుకు అడగలేదని నిలదీసింది.

మీకు స్వప్రయోజనాలే ముఖ్యం..(Delhi High Court)

ఆప్‌ ప్రభుత్వం అధికారం కోసం ఆర్రులు చాస్తోంది తప్ప ప్రజల అవసరాలను తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదని వ్యాఖ్యానించింది. స్టాండింగ్‌ కమిటిని నియమించడంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ విఫలమయ్యారని ప్రభుత్వం ఎల్‌జీపై అపవాదు మోపుతోందని డిల్లీ కోర్టు బెంచ్‌ చీఫ్‌ జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్‌మీత్‌ పీఎస్‌ అరోరాలు ఆప్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుమతులు కావాలంటే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలి… ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి జైల్లోనే కొనసాగాలా రాజీనామా చేయాలో మీ ఇష్టం… మీ ప్రభుత్వం ఇష్టం. మీ మంత్రి కోర్టులో ఏం చెబుతున్నారు. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు కాబట్టి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటున్నారు. దీన్ని బట్టి మీకు స్వప్రయోజనాలే ముఖ్యమని కోర్టు బలవంతంగా అనాల్సివస్తోందని జడ్జిలు అన్నారు. పిల్లలకు టెక్స్ట్‌ బుక్‌ సరఫరా చేయకుంటే మాత్రం కోర్టు చూస్తూ ఊరుకోదని ప్రభుత్వ న్యాయవాది షదాన్‌ ఫరాసత్‌ను హెచ్చరించింది.

ఇదిలా ఉండగా డిల్లీ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్‌జీఓ ఓ పిల్‌ దాఖలు చేసింది. ఎన్‌జీఓతో తరపున అడ్వకేట్‌ అశోక్‌ అగర్వాల్‌ .. ఎంసీడీ కమిషనర్‌ను కోర్టుకు పిలిపించాలని కోర్టును కోరారు. ఒక వేళ స్టాండింగ్‌ కమిటి లేకపోయినా కమిషనర్‌ కావాలనుకుంటే రూ.5 కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు ఇచ్చే అధికారం ఆయనకు ఉందని అశోక్‌ అగర్వాల్‌ కోర్టు చెప్పారు. స్టాండింగ్‌ కమిటి లేదని చెప్పి తప్పించుకోజాలరని కోర్టు వ్యాఖ్యానించింది. సామాన్యుడి గురించి డిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, స్కూళలో ఫర్నిచరల్‌ సరిగా లేదు. డెస్క్‌లతో పాటు చెయిర్‌లు విరిగిపోయి ఉన్నాయి. నగర మేయర్‌ ఇలాంటి స్కూళ్లలో వారి పిల్లలను చదివిస్తారా అని ప్రశ్నించారు జడ్జి మన్మోహన్‌. మీకు మనసు లేదా ముసలి కన్నీళ్లు వద్దని ప్రభుత్వానికి చురకలంటించింది. కాగా ఈ కేసును ఈ నెల 29కి సోమవారం నాటికి వాయిదా వేసింది డిల్లీ కోర్టు.

Exit mobile version