Site icon Prime9

Arvind Kejriwal: అవిశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్‌

Arvind-Kejriwal

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సభలో 59 మంది సభ్యలు అయనకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సీబీఐ మనీష్‌ సిసోడియాపై ఫేక్‌ లిక్కర్‌ కేసు నమోదు చేసి దాడులు చేసినప్పటి నుంచి గుజరాత్‌లో ఆప్‌కు నాలుగు శాతం వోట్‌ షేరు పెరిగిందని, ఒక వేళ ఆయనను అరెస్టు చేస్తే వోట్‌ షేరింగ్‌ ఆరు శాతానికి చేరుతుందని, ఒక వేళ సిసోడియాను రెండు సార్లు అరెస్టు చేస్తే గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన అసెంబ్లీలో అవిశ్వాస పరీక్ష సందర్భంగా అన్నారు.

సీబీఐ అధికారులకు మనీష్‌ సిసోడియా ఇంటి నుంచి కానీ ఆయన బ్యాంకు లాకర్‌ నుంచి కానీ ఏమీ లభించలేదన్నారు. సీబీఐ అధికారులకు కూడా సిసోడియా ఇంటి నుంచి కానీ లాకర్‌ నుంచి కానీ ఏమీ లభించదని తెలుసు. అయినా పై అధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్‌ అన్నారు. సిసోడియాను ఒక్కసారి అయినా అరెస్టు చేస్తామని అధికారులు తమతో చెప్పారని, మీరు అరెస్టు చేయాలనుకుంటే చెప్పండి తానే వచ్చి అరెస్టు అవుతానని సిసోడియా చెప్పారని కేజ్రీవాల్‌ సభకు తెలియజేశారు. మనీష్‌ సిసోడియాను అరెస్టు చేయడం తథ్యం. అయితే ప్రధానమంత్రి మోదీ నుంచి ఇప్పటికే రెండు సార్లు క్లీన్‌ చిట్‌ దక్కించుకున్న విషయం దేశ ప్రజలంతా చూశారని కేజ్రీవాల్‌ అన్నారు. అరెస్టులనేవి రాజకీయాల్లో ఒక భాగమని, అవి సాధారణమేనని కేజ్రీవాల్‌ వ్యంగ్యంగా అన్నారు. 49 ఆప్‌ ఎమ్మెల్యేలపై మొత్తం 169 కేసులున్నాయని తనపైనే 16 కేసులున్నాయని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

టెలివిజన్‌ డిబేట్లు చూస్తుంటే బాధేస్తుందన్నారు కేజ్రీవాల్‌. అన్ని స్కూళ్లు అవసరమా, అన్నీ టాయిలెట్లు అవసరమా, అన్నీ క్లాస్‌ రూమ్‌లు అవసరమా అంటూ తనను టార్గెట్‌ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్నులు తమ పిల్లలను నాణ్యమైన విద్య కోసం విదేశాలకు పంపిస్తారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అవసరం లేదా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం దిల్లీ స్కూళ్ల పై పడ్డారని, తాము ప్రజలకు మంచి చేస్తే దాంట్లో తప్పులు వెతుకుతున్నారన్నారు కేజ్రీవాల్‌. ప్రతి రాస్ట్రం నుంచి ఏదో ఒక్కటి నేర్చుకోవాలనుకుంటానని ఆయన అన్నారు. అస్సాంకు వస్తానంటే సీఎం హిమంతా బిస్వాస్‌ నోరు మెదపరని అయితే తనపై విమర్శలు మాత్రం గుప్పిస్తుంటారని అస్సాం సీఎంపై ధ్వజమెత్తారు సీఎం కేజ్రీవాల్‌.

Exit mobile version