AIIMS: ఢిల్లీ ఎయిమ్స్ లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారి భోజనంలో బొద్దింక భాగాలు

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరిన నాలుగేళ్ల చిన్నారికి భోజనంలో బొద్దింక రావడం కలకలం సృష్టించింది.

  • Written By:
  • Publish Date - November 15, 2022 / 03:59 PM IST

Delhi: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరిన నాలుగేళ్ల చిన్నారికి భోజనంలో బొద్దింక రావడం కలకలం సృష్టించింది. ఓ పెద్ద సర్జరీ తర్వాత చిన్నారికి వడ్డించిన తొలి భోజనం ఇదేనని ఓ ట్విట్టర్ యూజర్ ఆరోపించారు. “జాతీయ రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్దలో దయనీయమైన మరియు భయానక స్థితి- 4 సంవత్సరాల వయస్సులో ప్రధాన కడుపు శస్త్రచికిత్స తర్వాత మొదటి భోజనం @aiims_newdelhiకి ‘బొద్దింక దాల్’ అందిస్తోంది. నమ్మలేని విధంగా షాక్ అయ్యాను అని ట్విట్టర్ వినియోగదారు సాహిల్ జైదీ పేర్కొన్నారు. .

జైదీ షేర్ చేసిన ఫోటో ఫుడ్ ట్రేలో ఛిద్రమైన బొద్దింక భాగాలను చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటన పై ఆసుపత్రి యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఆదివారం రాత్రి ఓ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంవత్సరం జూలైలో, ఛత్తీస్‌గఢ్‌లోని మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. రోగి యొక్క డ్రిప్ ట్యూబ్‌ నుంచి ఎలుకలు గ్లూకోజ్ తాగుతున్నదృశ్యాలు బయటకు వచ్చాయి. ఇది బస్తర్ జిల్లా జగదల్‌పూర్ నగరంలో ఉన్న దివంగత బలిరామ్ కశ్యప్ మెమోరియల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది. పక్క బెడ్‌లో అడ్మిట్‌ అయిన మరో రోగి బంధువులు ఈ విషయాన్ని మొబైల్‌లో రికార్డు చేయడంతో విషయం వెలుగు చూసింది.

ఆసుపత్రి ఆవరణలో ఎలుకల బెడద ఎక్కువైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టికు సిన్హా అంగీకరించారు. చీడ పీడల నివారణకు ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు కూడా ఇచ్చామని వెల్లడించారు. ఇక్కడ 1200 ఎలుకలు చంపబడ్డాయని తెలుస్తోంది.