Site icon Prime9

Cyber Crime: డార్క్ వెబ్‌లో అమ్మకానికి మూడు కోట్ల మంది రైల్వే ప్రయాణికుల డేటా

Railway Data

Railway Data

Cyber Crime: భారతీయ రైల్వేలో నమోదైన సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికుల డేటా హ్యాక్ చేయబడి, డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హ్యాక్ చేసిన అతిపెద్ద డేటాలో భారతీయ రైల్వే డేటా ఒకటి అని హ్యాకర్లు పేర్కొన్నారు.

“హ్యాక్ చేయబడిన డేటాలో వినియోగదారు పేర్లు, ఇమెయిల్‌లు, మొబైల్ నంబర్లు, లింగం, పూర్తి చిరునామా మరియు వారి భాషా ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇవి భారతీయ రైల్వే పోర్టల్ నుండి టిక్కెట్లను బుక్ చేసుకునే వినియోగదారుల డేటా అని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న ఫోరమ్‌లో విక్రయించబడిన భారతీయ రైల్వే డేటా, వినియోగదారు డేటా మరియు తాజా నెల ఇన్‌వాయిస్‌లను కలిగి ఉంది. షాడోహ్యాకర్’ అనే మారుపేరును ఉపయోగించే హ్యాకర్, ప్రభుత్వ ఇమెయిల్ ఐడిలు మరియు వారి సెల్ ఫోన్ నంబర్లను కలిగి ఉన్న ప్రభుత్వ వ్యక్తుల డేటా కూడా తన వద్ద ఉందని పేర్కొన్నాడు.ఇప్పటి వరకు భారతీయ రైల్వే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.2020లో ఇటువంటి కేసు తర్వాత భారతీయ రైల్వే టికెట్ కొనుగోలుదారుల డేటా హ్యాక్ కావడం ఇది రెండోసారి.

Exit mobile version