Site icon Prime9

Culvert collapsed: కుప్పకూలిన కల్వర్టు.. క్షేమంగా బయటపడ్డ జనం.. యుపిలో ఘటన

culvert collapsed in UP. But people survived the incident unharmed

Uttar Pradesh: గుజరాత్ రాష్ట్రం మోర్బీలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్ ఘటనను మరవక ముందే ఉత్తరప్రదేశ్ లో ఓ కల్వర్డు కుప్పకూలింది. అయితే ఘటనలో ప్రజలు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. చందౌలి జిల్లాలోని సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా, కాలువపై నిర్శించిన ఓ కల్వర్టు మీద జనం పోటెత్తారు. పాతబడిన ఆ వంతెన బరువును మోయలేక కుప్పకూలింది.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే నిబడటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఇది కూడా చదవండి: Morbi Bridge Collapse: మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన పై న్యాయమూర్తిచే విచారణకు కాంగ్రెస్ డిమాండ్

Exit mobile version