Site icon Prime9

Cow Urine: గోమూత్రంపై ఐవీఆర్ఐ అధ్యయనం.. వెలుగులోకి సంచలన విషయాలు

Cow Urine

Cow Urine

Cow Urine: భారత్ లో గోవులను పూజిస్తారు. గోమూత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆర్థరైటిస్, ఉబ్బసం, క్యాన్సర్, మధుమేహం లాంటి చాలా రకాల వ్యాధులకు గోమూత్రం ఔషదంగా పనిచేస్తుందని నమ్ముతారు. ఈ నమ్మకంతోనే చాలామంది దాన్ని తాగుతారు. అయితే, ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (IVRI)చేసిన తాజా అధ్యయనంలో గోమూత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

రీసెర్చ్ లో పలు విషయాలు(Cow Urine)

గోమూత్రంలో 14 రకాల హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని ఐవీఆర్ఐ తెలిపింది. ఆవులు , ఎద్దుల మూత్రం గురించి పీర్ రివ్యూడ్ రీసెర్చ్ లో ఈ విషయాలు కనుగొన్నారట. ఈ బ్యాక్టీరియాల్లో మానవ జీర్ణ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే ఎస్చెరేషియా కోలి బ్యాక్టీరియా ఉందని పేర్కొన్నారు. ఆవులు, గేదెలు, మానవ మూత్రాలను పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో ఆవుల కంటే గేదెల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటి మరింత మెరుగ్గా ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన భోజ్ రాజ్ సింగ్ వెల్లడించారు.

 

మనుషుల రోగ నిరోధక శక్తిని పెంచేందుకు(Cow Urine)

ప్రయోగానికి థార్ పార్కర్, విందావని , సాహివాల్, అనే మూడు రకాల ఆవులను ఎంచుకున్నారు. వీటితో పాటు కొంత మంది మనుషులు, గేదెల సాంపిల్స్ కూడా సేకరించారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తుల మూత్ర నమూనాలో కూడా వ్యాధికారక బ్యాక్టిరియా ఎక్కువ నిష్పత్తిలో ఉంటుంది. అయితే గోమూత్రం గురించి తాజా అధ్యయనంపై ఐవీఆర్ఐ కు చెందిన మాజీ డైరెక్టర్ ఆర్ఎస్ చౌహాన్ స్పందించారు. ‘25 సంవత్సరాలుగా నేను గోమూత్రం మీద పరిశోధనలు చేస్తున్నాను. డిస్టిల్ట్ చేసిన గో మూత్రం మనుషులు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని.. తాగేందుకు సిఫారసు చేయెచ్చన్నారు. డిస్టిల్డ్ ఆవు మూత్రం మానవుల రోగనిరోధకర శక్తిని మెరుగు పరుస్తుంది. క్యాన్సర్, కోవిడ్ చికిత్సల్లో ఉపయోగించవచ్చని కొనుగొన్నాం.’

 

Exit mobile version
Skip to toolbar