Site icon Prime9

Cow cess: హిమాచల్ ప్రదేశ్ లో ఆవు పన్ను.. ఒక్కొక్క లిక్కర్ బాటిల్ పై రూ.10 వసూలు

Cow cess

Cow cess

Cow cess:రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఒక్కో సీసాపై రూ.10 ఆవు సెస్ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం ప్రకటించారు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి తన పదవీకాలంలో మొదటి వార్షిక బడ్జెట్ సమర్పణ సందర్భంగా సుఖూ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో టూరిజాన్నిఅభివృద్ది చేసే చర్యలను కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రా జిల్లాను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, వచ్చే ఏడాదిలో మొత్తం 12 జిల్లాలను హెలిపోర్ట్ సౌకర్యంతో అనుసంధానిస్తామని సుఖు చెప్పారు. 2022-23లో రాష్ట్ర జిడిపి వృద్ధి మందగించింది మరియు 2021-22లో నమోదైన 7.6 శాతం వృద్ధితో పోలిస్తే 6.4 శాతానికి పడిపోయింది.రూ.1,000 కోట్లతో 1,500 డీజిల్ బస్సులను మార్చనున్నట్లు సుఖు తెలిపారు. ఈ విధంగా హిమాచల్ ప్రదేశ్ తన ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రికల్ వాహనాలను స్వీకరించడానికి ఒక మోడల్ రాష్ట్రంగా మారుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20,000 మంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలుపై రూ.25,000 సబ్సిడీని కూడా ఆయన ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం 40,000 డెస్క్‌లను కూడా అందిస్తుంది.జలశక్తి శాఖలో మొత్తం 5,000 కొత్త నియామకాలు చేస్తామన్నారు. చిన్న దుకాణదారు పథకం కింద 1 శాతం వడ్డీ కి రూ. 50,000 రుణం అందిస్తామన్నారు.జథియా దేవి సిమ్లాలో కొత్త నగరాన్ని ప్రతిపాదించామని, ఇందుకోసం రూ.1,373 కోట్లతో డీపీఆర్‌ రూపొందించామని చెప్పారు.

ఆవు పన్ను ఎందుకంటే.. (Cow cess)

దేశంలోని కొన్ని రాష్ట్రాలు వీధి జంతువుల సంరక్షణ కోసం నిధిని ఏర్పాటు చేయడానికి ‘ఆవు సెస్’ విధించాలని నిర్ణయించాయి. పన్ను రేటు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది ఇది 2% నుండి 20% వరకు ఉంటుంది.గోవులను రక్షించడానికి, విచ్చలవిడి జంతువుల సంరక్షణ మరియు గోశాలలకు నిధుల కోసం రాష్ట్రాలలో ఆవు సెస్ అమలు చేయబడుతుంది.ఇది ప్రధానంగా మద్యం సీసాలు, కార్లు మరియు బైక్‌లు వంటి విలాసవంతమైన వస్తువులు మరియు సేవలపై విధించబడుతుంది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా, రాజస్దాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగర్ లో ఆవుపన్ను విధిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar