Site icon Prime9

Covid-19: అలర్ట్.. దేశంలో మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్

central government approves nasal vaccine and other details

central government approves nasal vaccine and other details

Covid-19: కోవిడ్ 19 మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. మరెంతో మంది జీవితాలను నాశనం చేసింది. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో.. మళ్లీ కోరలు చాస్తోంది కోవిడ్ 19. దేశంలో ఒకే రోజు 800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య.. (Covid-19)

దేశంలో ఉన్నట్టుండి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒక్కసారిగా నమోదు అవడం.. నాలుగు నెలల తర్వాత ఇదే మెుదటి సారి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ మళ్లీ వ్యాపిస్తుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

నాలుగు రాష్ట్రాల్లో అధికం

కోవిడ్ మరోసారి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలల్లో మెుదటి సారి ఒకే రోజు అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ముఖ్యంగా.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ కేసులు అధికంగా పెరుగుతున్నాయి.

ఈ మహమ్మారి కారణంగా.. ఝార్ఖండ్‌లో ఒకరు, మహారాష్ట్రలో మరొకరు, కేరళలో ఇద్దరు మరణించారు. నెల రోజుల్లో కేసుల సగటు సంఖ్య ఆరు రెట్లు పెరిగింది.

గత ఫిబ్రవరి 18న 112 కేసులు నమోదైతే, నెల తర్వాత 626కు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01గా ఉంది.

రికవరీ రేటు 98.80గా ఉంది. శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయానికి అధికారిక లెక్కల ప్రకారం.. కోవిడ్ సోకిన వారి సంఖ్య 4.46 కోట్లు (4,46,94,349)గా ఉంది.

కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161. మరణాల శాతం 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు 220.64 శాతం కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.

ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

దీంతో ఈ ఆరు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

Exit mobile version