sambar with Dosa: బీహార్ లోని బక్సర్‌లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్‌ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్‌ను అందించనందుకు రెస్టారెంట్‌కు రూ.3,500 జరిమానా విధించారు.
మానసిక, శారీరక, ఆర్దిక బాధలు..(sambar with Dosa)
ఒక కస్టమర్, ‘స్పెషల్ మసాలా దోస’తో పాటు సాంబార్ వడ్డించనందున, రెస్టారెంట్‌ను వినియోగదారుల కోర్టుకు లాగారు. పిటిషనర్‌కు సాంబార్ నిరాకరించడం వల్ల మానసిక, శారీరక మరియు ఆర్థిక” బాధలు కలుగుతున్నాయని వినియోగదారుల న్యాయస్థానం పేర్కొంది. ఈ సంఘటన ఆగష్టు 15, 2022న జరిగింది, మనీష్ గుప్తా తన పుట్టినరోజున నమక్ రెస్టారెంట్ యొక్క ‘స్పెషల్ మసాలా దోశ’ను తినాలని నిర్ణయించుకున్నారు. రెస్టారెంట్‌కి వచ్చిన అతను రూ.140 విలువైన దోశను ఆర్డర్ చేశాడు.ఇంటికి చేరుకోగానే, దోసతో పాటు సాంబారు లేకపోవడంతో అతను నిరాశ చెందాడు. గుప్తా రెస్టారెంట్‌కి వెళ్లి సాంబార్ గురించి అడిగాడు. గుప్తా ఫిర్యాదును రెస్టారెంట్ యజమాని సీరియస్‌గా తీసుకోలేదు. రూ. 140కి మొత్తం రెస్టారెంట్ కొనాలనుకుంటున్నారా? రెస్టారెంట్ యజమాని వెక్కిరించాడు.న్యాయవాది రెస్టారెంట్‌కు లీగల్ నోటీసును అందించారు. స్పందన లేకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.11 నెలల తర్వాత, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ వేద్ ప్రకాష్ సింగ్ మరియు సభ్యుడు వరుణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ మనీష్ గుప్తాకుమానసిక, శారీరక మరియు ఆర్థిక బాధలను గుర్తించి, రెస్టారెంట్‌ను దోషిగా నిర్ధారించింది.
దీనితో రెస్టారెంట్‌కు రూ.3,500 జరిమానా విధించారు. జరిమానా రెండు భాగాలుగా విధించబడింది – రూ. 1,500 వ్యాజ్యం ఖర్చు, మరియు రూ. 2,000 ప్రాథమిక జరిమానా విధించింది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్‌కు 45 రోజుల గడువు ఇచ్చింది. సకాలంలో చెల్లించకపోతే, జరిమానా మొత్తంపై రెస్టారెంట్ 8% వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.