Umesh Pal kidnapping case: ప్రయాగ్‌రాజ్ కోర్టు 2007లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ మరియు మరో ఎనిమిది మందినిదోషులుగా నిర్ధారించింది.ఈ కేసుకు సంబంధించి రక్షణ కల్పించాలని కోరుతూ అహ్మద్ చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు నిరాకరించింది. బదులుగా తన ఫిర్యాదులతో హైకోర్టును ఆశ్రయించాలని అహ్మద్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
.ఉత్తరప్రదేశ్‌లోని జైలుకు తరలించడంపై ఆందోళనలు లేవనెత్తుతూ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. అహ్మద్ తరఫున హాజరైన ఆయన న్యాయవాది ఆతిక్ అహ్మద్ కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ కోర్టు పిటిషనర్ రక్షణను నిరాకరిస్తే, అది అతనికి డెత్ వారెంట్ అని అర్ధం” అని అతని న్యాయవాది చెప్పారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇది ఈ కోర్టుకు సంబంధించిన అంశం కాదు. మళ్లీ హైకోర్టుకు వెళ్లండి అని పేర్కొంది.
2007లో ఉమేష్ పాల్‌ని కిడ్నాప్ చేసిన కేసులో మంగళవారం మధ్యాహ్నం అహ్మద్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కోర్టు ముందు హాజరుపరిచారు. సబర్మతి జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే, కొంతమంది విలేఖరులు మీరు భయపడుతున్నారా అని అడిగినప్పుడు, అహ్మద్ ఇలా అన్నాడు. నాకు వారి ప్లాన్ తెలుసు. వారు నన్ను చంపడానికి చూస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్‌ని తన ఇద్దరు పోలీసు గార్డులతో పాటు కాల్చి చంపినట్లు ఆరోపించిన కేసు కిడ్నాప్ కేసుతో సంబంధం కలిగి ఉంది. ఉమేష్ 2005 రాజు పాల్ హత్య కేసులో అహ్మద్ ప్రధాన నిందితుడుగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఉమేష్ భార్య జయ 2006లో ఆతిక్ అహ్మద్ సహచరులు తన భర్తను కిడ్నాప్ చేసి కోర్టులో తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశాని ఆరోపించింది.గత నెలలో ఉమేష్ హత్య తర్వాత, అహ్మద్ మరియు అతని భార్య సహిస్తా పర్వీన్, వారి ఇద్దరు కుమారులు, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో అహ్మద్ ప్రధాన నిందితుడు, ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ఫిబ్రవరి 24న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డాడు..కొద్ది రోజుల క్రితం, ప్రయాగ్‌రాజ్ కాల్పుల వీడియో వైరల్ అయింది అతిక్ అహ్మద్ కుమారుడు ఉమేష్ పాల్‌ను వీధిలో వెంబడిస్తున్నట్లు కనిపించింది.ఉమేష్ పాల్ హత్య కేసుకు సంబంధించిన 24 సెకన్ల ఈ తాజా వీడియో సీసీటీవీ ఫుటేజీలో బంధించిన పోలీసులకు కొత్త సాక్ష్యం. ఇప్పుడు ఈ కొత్త వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.అంతకుముందు, యూపీలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచినప్పుడు యూపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని అతిక్ అహ్మద్ వ్యక్తం చేశారు. అందుకే బదిలీ సమయంలో తనతో పాటు సీబీఐ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనితో ఆతిక్ అహ్మద్ తో యూపీ పోలీసు బృందంతో పాటు సీబీఐ టీం కూడా వస్తుంది.