Site icon Prime9

Anil Dujana: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‭స్టర్ అనిల్ దుజానాను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

anil dujana

anil dujana

Anil Dujana: ఉత్తరప్రదేశ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్.. కరుడుగట్టిన నేరగాడు అనిల్ దుజానా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. అనిల్ దుజానాపై హత్యలు, దోపీడీలు, భూ కబ్జాలు వంటి అనేక కేసులు ఉన్నాయి.

పోలీసుల కాల్పులు.. (Anil Dujana)

ఉత్తరప్రదేశ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్.. కరుడుగట్టిన నేరగాడు అనిల్ దుజానా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. అనిల్ దుజానాపై హత్యలు, దోపీడీలు, భూ కబ్జాలు వంటి అనేక కేసులు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ మీరట్ లో చోటు చేసుకుంది. అనిల్ దుజానాను 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఇతనిపై 62 పైగా కేసులున్నాయి. అదే 2022లో బెయిల్ పై విడుదలైన దుజానా.. పాత కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.

మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మద్ ఎన్‭కౌంటర్ మరువక ఈ ఎన్ కౌంటర్ జరగడం చర్చనీయంశమైంది.

అనిల్ దుజాను యూపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం కాల్పుల్లో హతమార్చారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఇతడిపై పలు కేసులు ఉన్నాయి.

ఇందులో 18 కేసులు అత్యంత క్రూరానికి పాల్పడినవిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదిత్యనాథ్ మాటలు నిజం..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మాఫియాను పూర్తిగా అంతమెుందిస్తామని అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలను అనుగుణంగానే ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.

అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్‭కౌంటర్ అనంతరం, రాష్ట్ర టాస్క్‭ఫోర్స్ పోలీసులు చేసిన రెండవ పెద్ద ఎన్‭కౌంటర్ ఇదే.

ఈ నేరగాడిపై పలు స్టేషన్ లలో రివార్డు ఉంది. ఆ ప్రభుత్వం విడుదల చేసిన మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్ జాబితాలో అనిల్ దుజానా పేరు కూడా ఉంది.

అనిల్ దుజానా పేరు చెబితే కొందరికి నిద్ర కూడా పట్టదని అక్కడి స్థానికులు చెప్పుకుంటారు.

గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ నేరగాడి పేరు చెబితే వణికిపోయేవారని అక్కడి వారు అంటుంటారు.

Exit mobile version