Karnataka Vidhana Soudha: బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని ఆవు మూత్రంతో శుభ్రపరిచారు. అవినీతి బిజెపి పాలన ముగిసిన నేపధ్యంలో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.
.కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఏడాది జనవరిలో విధానసౌధ (అసెంబ్లీ)ని గోమూత్రంతో శుభ్రపరిచే సమయం వచ్చిందని చెప్పారు.మేము విధాన్ సౌధను శుభ్రం చేయడానికి కొంత డెటాల్‌తో వస్తాము. శుద్ధి చేయడానికి నా దగ్గర కొంత ఆవు మూత్రం కూడా ఉందని శివకుమార్ అన్నారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి, డిప్యూటీగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కున్న బలం మేరకు మరో 24 మంది మంత్రులను ఎంపిక చేసుకునే వెసలుబాటు ఉంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని ఆదివారం సస్పెండ్ చేశారు.
చిత్రదుర్గంలోని హొసదుర్గంలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శాంతమూర్తి ఎంజీ అనే ఉపాధ్యాయుడు రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఉచితాలపైనా విమర్శలు గుప్పించారు. ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అని శాంతమూర్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన పోస్ట్‌లో, పాఠశాల ఉపాధ్యాయుడు వివిధ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పును పేర్కొన్నాడు.