Site icon Prime9

Rahul Gandhi on caste census: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కులగణన జరుగుతుంది.. రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi on caste census: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న చేప‌ట్టేందుకు చ‌ర్యలు చేప‌డ‌తారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతెలిపారు. సోమ‌వారం సీడ‌బ్ల్యూసీ స‌మావేశం అనంత‌రం రాహుల్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

వ‌ర్కింగ్ క‌మిటీ భేటీలో తాము కుల గ‌ణ‌న‌పై విస్తృతంగా చ‌ర్చించామ‌ని, ప్రతి ఒక్కరూ దీనికి మ‌ద్దతిచ్చార‌ని తెలిపారు. మ‌రోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కుల గ‌ణ‌న స‌ర్వేలు నిర్వహిస్తార‌ని పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో కుల గ‌ణ‌న‌తో పాటు త్వర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌హా ప‌లు అంశాల‌పై సంప్రదింపులు జ‌రిపారు.అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి అవ‌స‌ర‌మైన వ్యూహాల‌పై చ‌ర్చించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా ఉంద‌ని, రాజ‌స్ధాన్‌లో ఈ దిశ‌గా ప్రక్రియ మొద‌లైంద‌ని కాంగ్రెస్ నేత భ‌న్వర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో రాజ‌స్ధాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క‌, హిమాచ‌ల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల సీఎల్పీ నేత‌లు పాల్గొన్నారు.

కులగణనకు మోదీ సిద్దంగా లేరు..(Rahul Gandhi on caste census)

దేశవ్యాప్తంగా కులాల వారీ సర్వేను మోదీ నిర్వహించకపోవడాన్ని రాహుల్ తప్పుపట్టారు. తప్పుదారి పట్టించే వ్యూహాలతో కులాల సర్వే నిర్వహణకు మోదీ గండికొడుతున్నారని మండిపడ్డారు. కులగణనకు ఆయన సిద్ధంగా లేరు. మాకున్న నలుగురు ముఖ్యమంత్రులలో ముగ్గురు ఓబీసీలు ఉన్నారు. 10 మంది బీజేపీ ఎంపీల్లో ఒక్కరే ఓబీసీ క్యాటగిరీకి చెందిన వారున్నారు. ఓబీసీల నుంచి బీజేపీ సీఎంలు ఎందరు ఉన్నారు? ఓబీసీలకు మోదీ చేసిందేమీ లేదు. ప్రధానమైన సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు’ అని రాహుల్ ప్రధానిపై విమర్శల వర్షం కురిపించారు. కుల సర్వే నుంచి దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యం. రాబోయే రోజుల్లో మరింతగా దృష్టిమళ్లించే ప్రయత్నం జరుగుతుంది. కులగణన రాజకీయ నిర్ణయం కాదు. న్యాయ ఆధారిత నిర్ణయం” అని రాహుల్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version