Site icon Prime9

Mallikarjun Kharge comments: ప్రధాని మోదీ విషసర్పం లాంటివాడన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే .. తరువాత యూటర్న్.

Mallikarjun Kharge comments

Mallikarjun Kharge comments

Mallikarjun Kharge comments: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రధాని మోదీని ‘విష సర్పంగా అభివర్ణించారు. తరువాత ఖర్గే తన ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది.

బీజేపీ పాములాంటిది..(Mallikarjun Kharge comments)

కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తూ ప్రధాని మోదీ విషసర్పం లాంటివాడు, ఇది విషం కాదా అని మీరు అనుకోవచ్చు. మీరు దానిని నాకితే చనిపోతారని అన్నారు. తర్వాత ఖర్గే మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీ ఓ పాము లాంటిదని, పార్టీ సిద్దాంతాలు విషపూరితంగా ఉంటాయని చెప్పానని వివరణ ఇచ్చారు. ఓ వేళ ఆ సిద్దాంతాలకు మద్దతు తెలిపితే లేదా నాకితే చావు తప్పదని చెప్పానని ఖర్గే చెప్పుకొచ్చారు. తాను మోదీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదన్నారు. తాను వ్యక్తిగత విమర్శలకు దిగనని గతంలో కూడా చెప్పానని గుర్తు చేశారు.

ఖర్గే మనసులో విషం ఉంది..

దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ, కాంగ్రెస్ చీఫ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా ‘డమ్మీ’ కాంగ్రెస్ అధ్యక్షుడంటూ రుచుకుపడింది. మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా చేసింది.. కానీ ఆయనను ఎవరూ అలా పరిగణించడం లేదని, అందుకే సోనియాగాంధీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కంటే దారుణమైన స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని భావించారని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.ఖర్గే మైండ్‌లో విషం ఉందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. ఖర్గే మనసులో విషం ఉంది. ప్రధాని మోదీ మరియు బీజేపీ పట్ల పక్షపాత బుద్ధి. పోరాడలేక నిరాశతో ఈ రకమైన ఆలోచన వస్తుంది. రాజకీయంగా ఆయన ఓడ మునిగిపోతోంది.ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ప్రపంచమంతా గౌరవిస్తోంది..

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అధ్యక్షుడు.. ఆయన ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి ప్రధాని, ప్రపంచం మొత్తం ఆయనను గౌరవిస్తోందంటే ప్రధాని కోసం అలాంటి భాష వాడడం కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలియజేస్తోంది. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.

బీజేపీ ఐటి డిపార్టుమెంట్‌ చీఫ్‌ అమిత్‌ మాలవియ . తన ట్విట్టర్‌ ఖాతాలో ఖర్గే చేసిన వీడియోలను పోస్టు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రధానమంత్రిని విష సర్పం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు సోనియా గాంధీ ప్రధానిని ‘మౌత్‌ కా సౌదాగర్‌” అని వ్యాఖ్యానించారు. అటు నుంచి కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా దిగజారిపోతోందని అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతోందని తెలిసే సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు మాలవియ.

Exit mobile version