PM Modi Comments: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాము ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కాగా మోదీ నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి కోసం బీజేపీ చేసిన కృషి ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో 1958 ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చట్టాన్ని తొలగించామని వెల్లడించారు. మీ ప్రజలను మీరు నమ్మకపోతే దేశాన్ని పాలించలేరు. వారి సమస్యలను గౌరవించి పరిష్కరించాలి. మొదట్లో ఈశాన్య భారతంలో వేర్పాటు రాజకీయాలు జరిగేవి. మేము వాటిని పాలన ఆధారంగా జరిగేలా నిర్ణయించాం. బీజేపీ మతం లేదా ప్రాంతం ఆధారంగా ప్రజలపై వివక్ష చూపదన్నారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కేవలం రాజకీయ అస్థిరత్వం మాత్రమే నాగాలాండ్‌లో ఉండేదని ప్రధాని అన్నారు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్‌ను పాలించేవారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి కేటాయించిన నిధులను కాంగ్రెస్ హయాంలో దారిమళ్లించేవారని విమర్శించారు. దిల్లీ నుంచి దిమాపూర్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చేవారని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు మాత్రం ఈ రాష్ట్రానికి శాంతి, పురోగతి, శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు మోదీ. సాంకేతికతను వినియోగించుకుని బీజేపీ ప్రభుత్వం అవినీతికి కళ్లెం వేసిందన్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ నుంచి వచ్చే సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతుందన్నారు ప్రధాని.
ఇదిలా ఉండగా నాగాలాండ్ బీజేపీ చీఫ్ తెంజిన్ ఇమ్నాను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. పెద్ద ఆకారం, చిన్న కళ్లతో ఆయన చూడ్డానికి ఫన్నీగా ఉంటారు. సోషల్ మీడియాలో పెట్టే ఆయన పోస్ట్‌లను తాను కూడా చూసి ఏంజాయ్ చేస్తానంటూ తెంజిన్‌ను గురించి ప్రస్తావించారు. దీనికి బదులుగా తెంజిన్ గురుజీ నే బోల్దియా బస్ హమ్ తో ధన్య్ హో గయే అంటూ ట్విట్ చేశారు.తెంజెన్ ఇమ్నా హాస్యం అతని ట్వీట్లలో కనిపిస్తుంది. మొదట, టెంజెన్ చిన్న కళ్ళు కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చర్చిస్తున్నప్పుడు సోషల్ మీడియా సంచలనంగా మారింది. చిన్న కళ్ళు కలిగి ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నాడు, ఎందుకంటే ఏదైనా నిస్తేజంగా మరియు విసుగు పుట్టించే సమయంలో ప్రజలకు తెలియజేయకుండా చిన్న నిద్ర చేయవచ్చని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి 14న నాగాలాండ్‌లో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు రూ.39.18 కోట్ల విలువైన నగదు జప్తు చేశాయి.ఈ దాడిలో నగదు, లిక్కర్ , డ్రగ్స్/నార్కోటిక్స్,ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు నాగాలాండ్ సీఈవో కార్యాలయం తెలిపింది.నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రూపిన్ శర్మ మాట్లాడుతూ బలహీనమైన ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశామని, ప్రస్తుతానికి పరిస్థితి చాలా సాధారణంగా ఉందని చెప్పారు.మూడు జిల్లాల్లో హింసాత్మక ఎనిమిది సంఘటనలతో సంబంధం ఉన్న 24 మందిని అరెస్టు చేశామని చెప్పారు. నాగాలాండ్‌లో ఎన్నికల కోడ్ ను వీలైనంత జాగ్రత్తగా అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము”