Site icon Prime9

Arvind Kejriwal: కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది..

Congress is finished says Kejriwal

Congress is finished says Kejriwal

Gujarat: గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో పారిశుధ్య కార్మికులతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలు అంశాలను మీడియా ప్రస్తావించింది. ప్రధానంగా ఆప్ ప్రభుత్వం దివాలా ఉందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరస్ధితిలో లేని సమయంలో గుజరాత్ ఎన్నికల కోసం వాణిజ్య ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతుందంటున్న కాంగ్రెస్ విమర్శలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ ముగిసిన కధగా అభివర్ణించారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గుజరాత్ లో బీజేపీని ఉండకూడదని కోరుకున్నవారే కాంగ్రెస్ కూడా వద్దనుకొంటున్నారన్నారు. అటువంటి వారి ఓట్లను తాము పొందేందకు ప్రయత్నిస్తామని చెప్పారు.

మొత్తం మీద సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది చివరిలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసం శ్రమిస్తూ ఓట్లను ఆప్ ఖాతాలో వేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు.

Exit mobile version