Site icon Prime9

Morbi Bridge Collapse: మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన పై న్యాయమూర్తిచే విచారణకు కాంగ్రెస్ డిమాండ్

Congress demands a judicial inquiry into the Morbi Bridge collapse

Gujarat: గుజరాత్ లో వందేళ్ల చరిత్ర కల్గిన మోర్బీ సస్పెన్షన్ వంతెన కూలిన ఘటనలో మృతదేహాలు కుప్పలు, కుప్పలుగా బయటపడుతున్న సంగతి విధితమే. ఈ నేపధ్యంలో మరమ్మత్తులు చేసిన 5రోజుల్లోనే పురాతన వంతెన కూలిపోవడం పై మాజీ సుప్రీకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వైద్య, ఆర్ధిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేసింది.

ఇప్పటివరకు సుమారుగా 130మంది వంతెన ప్రమాద సంఘటనలో మృతిచెందారని, కిక్కిరిసిన బ్రిడ్జ్ ఆదివారం కూలిపోవడం పై కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని వేడుకొన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా నాణ్యత పై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: Gujarath: కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో.. 132 మంది మృతి

Exit mobile version