CM Himanta Biswa Sharma: 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతెలిపారు.మేము 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా పోలీసు బలగాలకు శిక్షణ ఇవ్వడానికి మేము మాజీ సైనిక సిబ్బందిని కూడా తీసుకుంటామని అన్నారు.
గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడినందున, మరో ఐదు జిల్లాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించేందుకు అస్సాం ప్రభుత్వం కృషి చేస్తోందని మార్చిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.రాష్ట్రంలోని 60 శాతం ప్రాంతాలనుండి AFSPA తొలగించడం మరియు రాష్ట్రంలోని అనేక సాయుధ సమూహాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం శాంతియుత వాతావరణానికి దారితీసిందని, తన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి అన్నారు.
1990 నుంచి అమల్లో ఉన్న AFSPA.. (CM Himanta Biswa Sharm)
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ కార్యక్రమాల వల్ల అనేక సాయుధ సమూహాలతో శాంతి ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలోని 60 శాతం నుండి AFSPA తొలగింపు, అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయాలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి మరో ఐదు జిల్లాల్లో కూడా AFSPA తొలగించబడుతుందని ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.కేంద్రం ఏప్రిల్ 1,2022 నుండి మొత్తం అస్సాం రాష్ట్రం నుండి తొమ్మిది జిల్లాలు మరియు కాచర్ జిల్లా యొక్క ఉప-విభాగాన్ని మినహాయించి AFSPAని తొలగించింది. తరువాత అది లఖీపూర్ సబ్-డివిజన్ మరియు పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లా నుండి తొలగించబడింది.నవంబర్ 1990 నుంచి AFSPA కింద రాష్ట్రం ‘డిస్టర్బ్డ్ ఏరియా’గా ప్రకటించబడింది. ఇది అప్పటి నుండి ప్రతి ఆరు నెలలకు పొడిగించబడింది.
అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దు వివాదం పూర్తిగా పరిష్కారమైందని, మేఘాలయతో 12 వివాదాస్పద ప్రాంతాలలో ఆరింటిలో ఒప్పందం కుదిరిందని, మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన చర్చలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని శర్మ చెప్పారు.మిజోరాం, నాగాలాండ్‌తో సరిహద్దు సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనడానికి అస్సాం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.