Site icon Prime9

Prime Minister Modi: కొత్త హామీలతో, స్కీములతో వస్తున్నారు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్

Modi

Modi

Prime Minister Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.

రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స..(Prime Minister Modi)

మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ నకిలీ గ్యారంటీలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు మోదీ. కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ అలివికానీ హామీలను ఇచ్చి ఓట్లు దండుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కోటి ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీని ప్రకటించిన ప్రధాని మోదీ, ఈ కార్డు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు హామీ మరియు ఇది మోదీ హామీ అని అన్నారు.

బీజేపీకి ఇతర పార్టీలకు మధ్య వ్యత్యాసాన్ని గురించి మోదీ ప్రస్తావించారు. బీజేపీ పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్సకు గ్యారంటి ఇస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఉచితంగా వైద్య చికిత్స అందిస్తోందన్నారు. దేశ చరిత్రలో ఇప్పటి ఏ పార్టీ పేదలకు కోసం ఉచిత వైద్య చికిత్స అందించలేదన్నారు మోదీ. పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో నిర్వహించిన మెగా ప్రతిపక్షపార్టీల సమావేశం గురించి కూడా ప్రస్తావించారు. ఒకరి నొకరు విమర్శించుకునే వారు బురదజల్లుకొనే వారు ఒక చోట చేరారని ఎద్దేవా చేశారు.మధ్యప్రదేశ్‌లో షాడోల్‌ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నేషనల్‌ సికల్‌ సెల్‌ అనేమియా ఎరాడికేషన్‌ మిషన్‌ 2047ను ప్రారంభించారు. దీంతో పాటు ఒక పోర్టల్‌ను ప్రారంభించి ఈ వ్యాధి నివారించడానికి గైడ్‌లైన్స్‌ విడుదల చేశారు.

Exit mobile version
Skip to toolbar