Site icon Prime9

Shrikant Shinde: సీఎం కుర్చీలో కుమారుడు.. ఫోటో వైరల్

CM's son in the chair.. Photo viral

CM's son in the chair.. Photo viral

Maharashtra: ఓ రాష్ట్రానికి చెందిన సీఎం కుర్చీలో ఆయన కుమారుడు ఆశీనుడైనాడు. వెనుక భాగాన సీఎం ఫోటో ముందు వున్న కూర్చోలో కూర్చొన్న ఆ కుమారుడు చేస్తున్న వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిన ఆ సీన్ మహారాష్ట్రాలో చోటుచేసుకొనింది.

వివరాల్లోకి వెళ్లితే, మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి సీటులో కూర్చొన్న ఏక్ నాధ్ షిండే పరిపాలన క్రమంలో సీఎం కార్యాలయంతో పాటు తన ఇంటి వద్ద కూడ పాలన చేస్తుంటాడు. ఆ సమయంలో అధికారికంగా ఉండేందుకు షిండే కూర్చొనే సీటు వెనుక భాగాన మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని వ్రాసి వున్న బోర్డును అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. ఆయన కుమారుడు లోక్ సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఇంటి వద్ద తండ్రి సీఎం షిండే కార్యాలయంలోని అదే కుర్చీలో కూర్చొని రాజకీయాలు, ప్రజా సమస్యల పై చర్చిస్తుంటారు.

ఈ క్రమంలో ఎన్సీపి అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే ముఖ్యమంత్రి సీటులో కుర్చొని వున్న ఆయన కుమారుడి ఫోటోను ట్వీట్ చేస్తూ సూపర్ సీఎంగా అభివర్ణించారు. దీంతో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కసారిగా ఏకనాధ్ షిండే ప్రభుత్వం పై భగ్గుమన్నాయి. చివరకు ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం తన సానుభూతి తెలుపుతున్నట్లు సున్నితంగా విమర్శిస్తూ సీఎం కుర్చీ పై కూర్చొనడం తప్పని చెప్పకనే చెప్పేసారు. శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది, ఆదిత్య ఠాక్రే ఒక అడుగు ముందుకేసి మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా ఉండాల్సిన సమస్య లేదని ఎంపీ పై ఎద్దేవా చేశారు.

ఎట్టకేలకు సీఎం కుమారుడు తాను కుర్చొన్న కుర్చీ పై స్పందిస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. అది తమ నివాస గృహమని, సీఎం అధికారిక ఆఫీసు కాదని స్పష్టం చేసారు. అయితే వర్చువల్ సమావేశాల నేపధ్యంలో కుర్చీ వెనుక భాగాన ముఖ్యమంత్రి అని అధికారులు బోర్డు పెడుతుంటారని, ఇందులో తన తప్పేమి కాదని పేర్కొన్నారు.

అయితే ఇద్దరు రాజకీయ నేతలు ఉన్న నివాసంలో అధికారికం, సొంత వ్యవహారాలు అనే విధానాలు పాటించకుండానే పాలన చేస్తున్నామని సీఎం గుర్తించకపోవడం విడ్డూరమే మరి. ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా ఏకనాధ్ కుటుంబసభ్యులు ఘటనను సమర్ధించుకోవడం పట్ల సొంత పార్టీలోనే చర్చ సాగుతుంది.

Exit mobile version