Assam: అస్సాంలోని మదరసాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే వాటిపై బుల్డోజర్లు ప్రయోగించడం ఖాయమని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. జిహాదీ కార్యకలాపాలకు మదరసాను ఉపయోగించకపోతే, వాటిని కూల్చే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.
బుల్‌డోజర్ రాజ్’ను ఆపాలని, దేశవ్యతిరేక అంశాలను చట్టపరమైన పద్ధతిలో ఎదుర్కోవాలని బుధవారం ఎఐడియుఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం ప్రభుత్వాన్ని కోరారు. బొంగైగావ్ జిల్లాలోని మూడో మదర్సా కూల్చివేత స్థలాన్ని గురువారం ఆయన సందర్శించారు. బొంగైగావ్ జిల్లాలో ఉన్న ఓ మదర్సాను బుధవారం కూల్చివేశారు. అస్సాం ప్రభుత్వం కూల్చివేసిన మూడవ మదరసాఇది. అంతకుముందు సోమవారం బార్‌పేట జిల్లాలో ప్రభుత్వం మదరసాను కూల్చివేసింది.
ఈ నెల ప్రారంభంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, రాష్ట్రం ఇస్లామిక్ ఛాందసవాదానికి కంచుకోటగా మారుతోందని అన్నారు. అదే సమయంలో, భద్రతా దళాలు మార్చి నుండి 5 జిహాదీ కుట్రలను భగ్నం చేసినట్లు చెప్పారు.