Site icon Prime9

CM Arvind Kejriwal: బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఆఫర్ చేసింది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

CM Arvind Kejriwal

CM Arvind Kejriwal

 CM Arvind Kejriwal: ఢిల్లీలోని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించిందని, పార్టీ మారేందుకు వారికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిన బీజేపి ఆప్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టాలని ..( CM Arvind Kejriwal)

దీనికి సంబంధించి కేజ్రీవాల్ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్‌లో ఇలా రాసారు. ఇటీవల బీజేపీ నేతలు మా ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను సంప్రదించారు. కొన్ని రోజుల తర్వాత మేము కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తాము. ఆ ఆ తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి. ఇతరులతో కూడా మాట్లాడుతున్నాం.మీరు కూడా రండి.. రూ. 25 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే వారంతా తిరస్కరించారని కేజ్రీవాల్ చెప్పారు. తాము 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించామని బీజేపీ చెబుతున్నప్పటికీ, మా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కేవలం 7 మంది ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారని వారంతా తిరస్కరించారనిచెప్పారు.ఎన్నికల్లో ఆప్‌ని ఓడించే శక్తిలేక ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో, వారు మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా కుట్రలు పన్నారు. కానీ వారి వల్లకాలేదు. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. మా ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి బలంగాఉన్నారు. ఈసారి కూడా వారు విఫలమవుతారని అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ని అమితంగా ప్రేమిస్తారు. కాబట్టి ఆప్‌ని ఎన్నికలలో ఓడించలేరు. దీనితో నకిలీ మద్యం కుంభకోణం సాకుతో వారిని అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని కేజ్రీవాల్ చెప్పారు.

ఇలాఉండగా కేజ్రీవాల్ ఆరోపణలను కపిల్ మిశ్రా తోసిపుచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు”అని అన్నారు.వారిని సంప్రదించడానికి ఏ ఫోన్ నంబర్‌ను ఉపయోగించారు? ఎవరు సంప్రదించారు? ఎక్కడ సమావేశం జరిగింది అనేది ఒక్కసారి కూడా చెప్పలేకపోయాడు. అతను కేవలం స్టేట్‌మెంట్ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్తాడు. అతని భాగస్వాములు జైలులో ఉన్నారు. అతనికి ఈడీ ప్రశ్నలకు తన వద్ద సమాధానాలు లేవని తెలుసు కాబట్టి సమన్లను తప్పించుకుంటున్నారని అన్నారు.

Exit mobile version