Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో ప్రయాణీకులతో ఉన్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు తిరయ్య గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
రాయపూర్ ఎయిమ్స్ లో.. (Chhattisgarh)
క్షతగాత్రులను ప్రాథమికంగా చికిత్సకోసం రెండు ఆసుపత్రుల్లో చేర్పించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయ్‌పూర్‌కు తరలించారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేశామన్నారు.