Site icon Prime9

Chennai Floods: జలదిగ్బంధం..విద్యుత్ అంతరాయం.. చెన్నై వాసులను వీడని వరద కష్టాలు

Chennai Floods

Chennai Floods

Chennai Floods: మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం సృష్టించినరెండు రోజుల తరువాత కూడా తమిళనాడు రాజధాని చెన్నై మరియు దాని శివారు ప్రాంతాలలో నిలిచిపోయిన నీరు మరియు విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ తీగలు నీటిలో ఉన్నందున ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వేలచేరి మరియు తాంబరంతో సహా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. బుధవారం కూడా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కనిపించింది. మంగళవారం వర్షం కురవకపోవడంతో చెన్నై కొంత ఉపశమనం పొందింది. అయితే నగరమంతటా పెద్ద ఎత్తున నిలిచిపోయిన నీరు, విద్యుత్ కోతలు మరియు మొబైల్ నెట్‌వర్క్‌ల అంతరాయంతో ప్రజలు అల్లాడుతున్నారు. డిసెంబరు 7న చెన్నైలోని స్కూళ్లు, కాలేజీలకు మరో రోజు సెలవు ప్రకటించారు.

18 కు చేరిన మృతుల సంఖ్య (Chennai Floods)

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, అర్ధరాత్రి దాటినా పడవల ద్వారా అనేక ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను కాపాడుతున్నారని ప్రభుత్వం తెలిపింది.గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లోని సీనియర్ అధికారులు రెస్క్యూ మరియు రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది.పౌరుల కోసం పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా ప్రకటించారు.మంగళవారం నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో డజను మంది ప్రాణాలు కోల్పోయారు.దీనితో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 18 కు చేరింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మిచౌంగ్ తుఫాన్ కారణంగా చెన్నై ప్రజలు ఎదుర్కొంటున్న సవాలు పరిస్థితులను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో పోస్ట్ చేశాడు. తాను ఉంటున్న 30 గంటలకు పైగా విద్యుత్తు సరఫరా లేదని చెప్పాడు. చాలా చోట్ల అలానే ఉందనుకోండి. మాకు #ChennaiFloods ఏ ఎంపికలు ఉన్నాయో ఖచ్చితంగా తెలియదు అంటూ ట్వీట్ చేసాడు.

 

 

 

 

 

 

 

Exit mobile version