Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మోదీ సర్కారు ఈ మేరకు కీలక మార్పులు చేసింది. కేంద్ర మంత్రుల్లో ఇద్దరి శాఖలను మార్చారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. ఈ శాఖను మరో మంత్రికి అప్పగించారు.
కీలక మార్పులు.. (Central Cabinet)
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మోదీ సర్కారు ఈ మేరకు కీలక మార్పులు చేసింది. కేంద్ర మంత్రుల్లో ఇద్దరి శాఖలను మార్చారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. ఈ శాఖను మరో మంత్రికి అప్పగించారు.
కేంద్ర మంత్రివర్గంలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మంత్రిత్వ శాఖలను మార్చుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ను ఆ శాఖ నుంచి తొలగించారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్ కు న్యాయమంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. న్యాయశాఖ నుంచి తొలగించిన తర్వాత.. కిరణ్ రిజిజుకు భూ విజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రిత్వ శాఖలను మార్చుతున్నట్లు.. రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదల అయింది.
ప్రధాని మోదీ సలహా మేరకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అర్జున్ మేఘ్వాల్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
ఇకపై వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు.
కాగా.. కేబినెట్ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరోవైపు ప్రస్తుతం భూవిజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చూస్తుండగా.. ఇప్పుడు ఆ శాఖను కిరణ్ రిజిజుకు అప్పగించారు.
జితేంద్ర సింగ్ వద్ద ఇప్పటికే శాస్త్ర, సాంకేతికాభివృద్ధితోపాటు పలు శాఖలు ఉన్నాయి.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇక, అర్జున్ రామ్ మేఘ్వాల్.. రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.