Site icon Prime9

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. సంబరాలు చేసుకుంటున్న ఇస్రో

chandrayaan-3 success

chandrayaan-3 success

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం ఘన విజయం సాధించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సరిగ్గా మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‭డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగి శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు నింగిలోకి పయనించింది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్ తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగిస్తారు.

చంద్రయాన్-3 సక్సెస్(Chandrayaan-3)

ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. 40 రోజుల తర్వాత అంటే ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్‌ సేఫ్ గా దిగుతుంది.

Exit mobile version