Site icon Prime9

Central Government: 45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసిన కేంద్రం

Center blocked 45 YouTube videos

Center blocked 45 YouTube videos

New Delhi: విద్వేషాలు, మార్ఫింగ్, అసత్య వార్తల వ్యాప్తితో సమాజంలో అస్ధిరత ప్రేరేపిస్తున్న ఘటనలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. అందులో భాగంగా 10 యూట్యూబ్ ఛానెల్స్ కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసిన్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

కొద్ది నెలల కిందట తీసుకొచ్చిన నూతన ఆర్మీ చట్టంతో పాటు కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకొన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఐటి చట్టం – 2021 నిబంధనల మేర వీటిపై చర్యలు తీసుకొన్నారు.

సోషల్ మీడియాలో వాస్తవాలను దాచిపెట్టి, యువతను పక్కదారి పట్టించేలా వ్యవహరించడం వంటి అంశాలు ఈ మధ్య కాలంలో అధికమైనాయి. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు కూడా నమోదైవున్నాయి. తాజాగా మరో మారు కేంద్రం తప్పుడు వార్తల వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరో అడుగు ముందుకేసింది.

ఇది కూడా చదవండి: మంత్రి బొత్స మాటలు సరికాదు..పాదయాత్ర రైతులు

Exit mobile version