Site icon Prime9

CBI Raids: జమ్ము కశ్మీర్ లో 13 ప్రాంతాల్లో సీబీఐ దాడులు

CBI raids

CBI raids

CBI Raids: ఫైనాన్స్ అకౌంటెంట్ (ఎఫ్‌ఎ) రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) జమ్ము కశ్మీర్‌లో దాడులు నిర్వహిస్తోంది. జమ్మూలోని 13 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.

జమ్మూలోని కింజ్వానీ, అఖ్నూర్, సాంబా సహా పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల ప్రాంతంలో దాడులు ప్రారంభమయ్యాయి. ఈ కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల అనంతరం స్కామ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఫైనాన్స్ అకౌంటెంట్ (ఎఫ్‌ఎ) రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలను గుర్తించిన తరువాత, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ కు కేసును అప్పగించింది. జమ్మ కాశ్మీర్ సబ్-ఇన్‌స్పెక్టర్ స్కామ్, జెఇ సివిల్ రిక్రూట్‌మెంట్ క్యామ్ మరియు ఫైనాన్స్ అకౌంటెంట్ (ఎఫ్‌ఎ) రిక్రూట్‌మెంట్ స్కామ్ అనే మొత్తం మూడు కేసులను సీబీఐ కు అప్పగించారు.

అంతకుముందు ఆగస్టులో, జమ్మూ మరియు కాశ్మీర్ అక్రమాలను గుర్తించిన తర్వాత జమ్ముకశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఫైనాన్స్ అకౌంట్స్ అసిస్టెంట్లు మరియు జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, ఎంపిక ప్రక్రియపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేసింది.

Exit mobile version