Site icon Prime9

CBI raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

సీబీఐ దాడులపై మనీష్‌ సిసోడియా స్పందిస్తూ, నా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నేను సీబీఐ అధికారులకు సహాకరిస్తాను. అధికారులు నాకు వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేరు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుంది అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్‌ చేశారు.

Exit mobile version