Kejriwal: దిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన.. దాని అమలులో అవకతవకలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మద్యం విధానం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఆయన్ను 9 గంటలపాటు ప్రశ్నించింది.
9 గంటలు.. 56 ప్రశ్నలు (Kejriwal)
దిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన.. దాని అమలులో అవకతవకలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మద్యం విధానం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఆయన్ను 9 గంటలపాటు ప్రశ్నించింది.
ఆదివారం సీబీఐ ఎదుట కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు. మధ్యలో భోజన విరామం కోసం కొంత సమయం ఇచ్చి.. ఉదయం 11 నుంచి రాత్రి 8.30 వరకు ప్రశ్నల పరంపర కొనసాగించారు.
విచారణకు వెళ్లే ముందు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భాజపా సూచనల మేరకే దర్యాప్తు సంస్థ పనిచేస్తోందని ఆరోపించారు.
ఆ వీడియో తాను ఎలాంటి ప్రశ్నలు అడిగిన సమాధానం ఇస్తానని కేజ్రీవాల్ అన్నారు. విచారణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
పంజాబ్ కు చెందిన పలువురు నేతలను దిల్లీకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
విచారణ సమయంలో.. సీబీఐ 56 ప్రశ్నలు అడిగిందని.. వాటన్నింటికి సమాధానం చెప్పినట్లు కేజ్రీవాల్ తెలిపారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రాణాలైనా అర్పిస్తామే గానీ నిజాయతీని వీడే ప్రశ్నే లేదన్నారు. మద్యం కుంభకోణం పూర్తిగా కల్పితమని, కుటిల రాజకీయాలతోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
జాతీయ పార్టీగా విస్తరిస్తున్న ఆప్‌ను అంతం చేయాలన్న భాజపా కోరిక నెరవేరబోదన్నారు.
భాజపా ఆరోపణలు..
కేజ్రీవాల్ ఆరోపణలపై భాజపా స్పందించింది. అవినీతి ఆరోపణలు మళ్లించడానికే కేజ్రీవాల్ నాటకీయత ప్రదర్శిస్తున్నారని ఆరోపించింది.
దమ్ముంటే సత్యశోధన పరీక్షకు ఆయన సిద్ధపడాలని సవాల్ విసిరింది. వాస్తవాలపైనే సీబీఐ, ఈడీ వంటి సంస్థలు పనిచేస్తాయని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు.