Site icon Prime9

Punganur Riots: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై కేసు నమోదు

Punganur Riots

Punganur Riots

Punganur Riots: పుంగనూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఎ1 గా చంద్రబాబు, ఎ2గా దేవినేని ఉమ, ఎ3గా అమర్నాధరెడ్డిలపై ముదివేడు పోలీసు స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదు చేసారు. ఈ ఎఫ్ఐఆర్ లో 20 మందిపై కేసులు నమోదు చేసారు.

పుంగనూరు ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేసారు. మొత్తం 246 మందిపై కేసులు నమోదు చేసారు. ఇప్పటివరకు 74 మందిని అరెస్ట్ చేయగా మిగిలిన వారికోసం గాలింపు కొనసాగుతోంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా ములకల చెరువు పోలీసు స్టేషన్లో చంద్రబాబుపై కేసు నమోదు చేసారు. ఎ7 గా చంద్రబాబును ఎఫ్ ఐఆర్ లో చేరుస్తూ పోలీసుల మెమో జారీ చేసారు.పుంగనూరులో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర దాగి ఉందంటూ వైసీపీ నేత ఉమాపతి రెడ్డి ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును ఏ1గా మార్చారు. ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమరనాథ్ రెడ్డి పేర్లు చేరాయి. ఎఫ్‌ఐఆర్‌లో 20 మంది పేర్లను నమోదు చేశారు.

అల్లర్ల వెనుక చంద్రబాబు కుట్ర ..(Punganur Riots)

అల్లర్ల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఉమాపతి రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు అల్లర్ల వీడియో ఫుటేజీని కూడా పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన విధ్వంసానికి సంబంధించి టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దోషులను జైలుకు పంపేలా తానే స్వయంగా హామీ ఇస్తానని చెప్పారు.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడిన వారి జాబితాతో ‘రెడ్ డైరీ’ రూపొందిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు.

Exit mobile version